hamara Telangana

ఆయుధాలతో పోలీసుల అత్యుత్సాహం ఆగ్రహం వ్యక్తంచేసిన భక్తులు, అర్చకులు | Hamara Telangana

Breaking News News Political News
ఆయుధాలతో పోలీసుల అత్యుత్సాహం ఆగ్రహం వ్యక్తంచేసిన భక్తులు, అర్చకులు | Hamara Telangana
Rate this post

 వరంగల్‌ భద్రకాళి ఆలయంలో అపచారం జరిగింది. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల వేళ పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఆయుధాలతో గుడిలో పహారకాసే క్రమంలో ఆలయంలోని గణపతి దేవాలయంలో విగ్రహం వద్ద తుపాకులు ఉంచారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారికి అలంకరించిన స్వర్ణకిరీటం, ఇతర ఆభరణాలకు భద్రత కల్పించేందుకే పోలీసులు కాపలా కాస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పదిరోజులుగా భద్రకాళి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో కేసీఆర్‌ బహూకరించిన స్వర్ణాభరణాలను అమ్మవారికి అలంకరించిన దృష్ట్యా భద్రత కోసం నియమించిన పోలీసులను ఆలయం బయట కాపలాగా ఉండాలని ఆదేశించారు.
కానీఅందుకు విరుద్ధంగా పోలీసులు ఆయుధాలతో గుడి ప్రాంగణంలోకి రావడం, గర్భగుడిలో ఆయుధాలతో తిరగడంపై భక్తులు, అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ ఆయుధాలను గర్భగుడికి సమీపంలోని వినాయకుని విగ్రహం వద్ద ఉంచారు. వాస్తవానికి ఆలయంలోకి పోలీసులు ఆయుధాలతో ప్రవేశించడం నిషిద్ధం. అయితే భద్రత కోసమే తాము ఆయుధాలతో లోపల ఉన్నామని పోలీసులు చెబుతున్నా.. ఇందుకు సంబంధించి వారికి ఎలాంటి ఆదేశాలూ లేవని తెలుస్తోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *