ఐదు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Breaking News News Political News State
ఐదు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
Rate this post

హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. 119 నియోజకవర్గాలకు గానూ 1821 మంది అభ్యర్థులు బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతో పాటు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *