hamara

కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు

Breaking News Political News Trending

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల వేళ తమ అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్‌ 1న అభ్యర్థుల జాబితాతో పాటు అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు తుదిరూపం ఇచ్చేందుకు పార్టీ సీనియర్‌ నేతలతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయింది.

సెప్టెంబర్‌ 6న రాష్ట్ర ప్రభుత్వం రద్దైన రోజే తెరాస తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా.. తెరాసను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమిలోని పార్టీలు కూడా సీట్ల కేటాయింపు అంశం త్వరగా తేల్చాలంటూ పలు సందర్భాల్లో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమిలోని ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు కేటాయిస్తారో.. కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో బరిలోకి దిగుతుందో అనే విషయాలన్నీ నవంబర్‌ 1న తేలనుండటంతో ఈ జాబితాపై ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు
Rate this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *