కొండా సురేఖ ఏం చేయబోతున్నారు

Breaking News Entertinment Movies National News Political News State Trending
కొండా సురేఖ ఏం చేయబోతున్నారు
Rate this post

కొండా సురేఖ ఏం చేయబోతున్నారు

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించిన వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యురాలు కొండా సురేఖ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొని ఉంది. బహుశా ఈ రోజు తన భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది.వినాయకచవితి నవరాత్రుల పీడ దినాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. దీంతో కొండా సురేఖ సోమవారం టీఆర్ఎస్ తో తన అనుబంధాన్ని కొనసాగిస్తారా, పార్టీతో తెగదెంపులు చేసుకుంటారా అనేది తేలే అవకాశం ఉంది. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలని ఆమె టీఆర్ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆమె టీఆర్ఎస్ నాయకత్వానికి విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. అయితే, ఆమెకు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి సమాధానాలు వచ్చిన సూచనలేవీ కనిపించడం లేదు.

కాగా, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ఆమెతో రాయబారాలు నడిపినట్లు మాత్రం తెలుస్తోంది. అయితే, తాను వినాయక చవితి నవరాత్రులు ముగిసిన తర్వాత ఏ విషయమూ చెబుతానని ఆమె చెప్పినట్లు సమాచారం.

అయితే, కొండా దంపతులు టీఆర్ఎస్ లో కొనసాగే పరిస్థితి లేదని విశ్వసనీయవర్గాల సమాచారం. కేసిఆర్ తనయుడు, మంత్రి కెటి రామారావుపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత టీఆర్ఎస్ లో కొనసాగితే పరిస్థితి ఏలా ఉంటుందనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.

కొండా సురేఖ దంపతులు మూడు సీట్లు అడిగారని, ఆ మూడు సీట్లు ఇవ్వకపోవడం వల్లనే తిరుగుబాటు బావుటా ఎగురేశారని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ స్థితిలో తన కుటుంబానికి మూడు టికెట్లు కేటాయించినా లేదా తాను వరంగల్ ఈస్ట్ సీటుతో రాజీ పడినా ప్రజల్లోకి ఏ విధమైన సంకేతాలు వెళ్తాయనే విషయంపై కొండా సురేఖ అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *