పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్

Breaking News News Political News State

హైదరాబాద్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు వేగం పెంచింది. కేసీఆర్ అన్నట్లు 14కు 14 స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి(వనపర్తి), డీకే అరుణ(గద్వాల), రేవంత్ రెడ్డి(కొడంగల్) వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్), మర్రి జనార్ధన్ రెడ్డి(నాగర్ కర్నూల్), నిరంజన్ రెడ్డి(వనపర్తి), పట్నం నరేందర్ రెడ్డి(కొడంగల్), చిట్టెం రామ్మోహన్ రెడ్డి(మక్తల్), అబ్రహాం(అలంపూర్), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల), రాజేందర్ రెడ్డి(నారాయణపేట), శ్రీనివాస్‌గౌడ్(మహబూబ్‌నగర్), అంజయ్య(షాద్‌నగర్) ముందంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ 4 వేల మెజార్టీపైనే దూసుకుపోతున్నారు.

పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్
Rate this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *