hamaratelangana

బతుకమ్మ ఆట కూడా పక్కదారి పడుతున్నాది !

Breaking News Entertinment National News State Trending
బతుకమ్మ ఆట కూడా పక్కదారి పడుతున్నాది !
Rate this post

నా తెలంగాణ సంస్కృతి విధ్వంసానికి కారణమెవ్వరు ?

నా బతుకమ్మ బతుకును బరుబాద్ జేస్తుందేవరు ?

ఈ విష సంస్కృతి ని ప్రేరేపిస్తున్నదెవరు ?

చేతులతో సప్పట్లు కొట్టేదిలేదు !
నోటితో పదం పాడేది లేదు !

బతుకమ్మ ను హైటెక్ బతుకమ్మ గా మారుస్తుండ్రు

గుజరాత్ నుండి దాండియాను దిగుమతి చేసి నయా బంగారు బతుకమ్మ గా ప్రచారం జేస్తున్నరు

తీరొక్క పాటలతో ! కొటొక్కరాగాలెత్తి
ఊరు ఊరంతటిని ఉయ్యాలలూపిన నా అక్కా చెల్లెళ్ళ నోర్లు పదం పాడనని ఎందుకు మొండికేస్తున్నాయ్

DJ చప్పుళ్లతో దాండియా కోలాటంతో !

పల్లెలన్నీ పబ్బులను తలపిస్తున్నయ్ !

ఇదేనా మన బతుకమ్మ ? ఇదేనా మన సంస్కృతి ?

ఒకవైపు బంజరు, బీడు భూములను కబ్జాలు చేస్తూ, సహజ పువ్వులను బతుకమ్మలకు దూరం చేస్తున్నరు

మరొకవైపు మన సంస్కృతిని ధ్వంసం జేస్తూ
DJ చప్పుళ్ళు ఉంటేనే తప్ప,! కోలాటాలు ఆడితేనే తప్ప ! అది బతుకమ్మ కాదు అనే అంతగా
ఈ జాడ్యం పెచ్చురిల్లిపోతుంది

పల్లెల్లో ఇంటింటికి చందాలు వసులు చేస్తూ మరీ, లౌడ్స్పీకర్లు కొనుగోలు చేసే స్థాయికి ఈ విపరీతం పెరిగిందంటే ! పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు

ఇది ముమ్మాటికి మన సంస్కృతిని విధ్వంసం చేసే కుట్రలో భాగమే !

బతుకమ్మ కు అంతర్జాతీయ ఖ్యాతి కోసం పగలూ రాత్రి కష్టపడుతున్నాం,

ఇదేనా మీరు తీర్చిదిద్దుతున్న సంస్కృతి ?

ఈ పాశ్చాత్య విష సంస్కృతినేనా మీరు భావితరాలకు అందించాలని అనుకుంటున్నది..?

మన సంస్కృతి ని కాపాడుకుందాం !

DJ చప్పుళ్ల బతుకమ్మ ను బహిష్కరించి !

మన సహజ సాంప్రదాయ బతుకమ్మ ను బతికిద్దాం !

మహిళా సమాజమా మేలుకోండి !మేలుకొలపండి.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో !
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *