విశ్వసనీయతకు, అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ… | Hamara Telangana

Breaking News National News Political News State Trending
విశ్వసనీయతకు, అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ… | Hamara Telangana
Rate this post

నిరుపేద వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం…

– సమస్యల పరిష్కారం – అభివృద్దే నా అంతిమ లక్ష్యం…

– ఇటిక్యాల , రామారావుపల్లె, జగన్నాథపూర్ గ్రామాల ఎన్నికల ప్రచారం లో జీవన్ రెడ్డి వ్యాఖ్య ..విశ్వసనీయతకు ,అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని , నిరుపేద వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని మాజీ మంత్రి , తాజా మాజీ ఎమ్మెల్యే ,కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు..మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాల, రామారావుపల్లె , జగన్నాథపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు..ఈ సందర్బంగా ఇటిక్యాల గ్రామం లోని ఒడ్డెర కాలనిలో ప్రచారం నిర్వహించారు..ఈ సందర్బంగా వారి సమస్యలు అడిగితెలుసుకున్నారు ..
అనంతరం ఒడ్డెర కాలనీ నుండి సుమారు 100మంది కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో , జీవన్ రెడ్డి సమక్షంలో చేరారు..కాగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రమకు ప్రతి రూపమే ఒడ్డెరలు అని వాళ్ళ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ , అండగా ఉంటానని హామీ ఇచ్చారు..ఇటిక్యాల ఎస్సి కాలనీ అంబెడ్కర్ విగ్రహం నుండి ఒడ్డెర కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు..తాగునీటి వసతి తో పాటు మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..అనంతరం నాయి బ్రాహ్మణా సంఘ సభ్యులను కలిసి మద్దతు కోరగా ..ఎల్లవేళలా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు..అనంతరం టిడిపి ముఖ్య నాయకులతో కలిసి కాసేపు ముచ్చటించి ,కార్యాచరణ అడిగి తెలుసుకొని ప్రచార ప్రణాళిక , వ్యూహాలపై వివరించారు.

.

అనంతరం రామారావుపల్లె లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ముదిరాజ్ కుల మహిళలు మంగళ హారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి , విజయ తిలకం దిద్దారు ..ముదిరాజ్ కులస్థులను బిసి – ఏ లో చేర్చడంతో పాటు రిజర్వేషన్ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు..పెద్దమ్మ గుడి , సామూహిక భవన నిర్మాణంకై నిధులు కేటాయిస్తామని ముదిరాజులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. నాటి కాంగ్రెస్ పార్టీ హయం లో చేసిన అభివృద్దే తప్ప కొత్తగా ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు..5లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, మహిళా సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్, ఉచిత వడ్డీ సౌకర్యం, ఏడాదికి 6 సిలిండర్లు, ప్రతి లబ్ధిదారునికి 7 కిలోల సన్నబియ్యం తో పాటు , 9రకాల ఉచిత వస్తువులు అందజేస్తామని తెలిపారు..కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే నిరుపేదలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యం అని అన్నారు..
ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని కోరారు…నాడు కాంగ్రెస్ హయం లో వేసిన రోడ్డు అతుకు మిగిలితే నాలుగేళ్లలో కనీసం అతుకు కూడా పూర్తి చెయ్యలేని ఘనత టీఆరెస్ పార్టీది అన్నారు..కాంగ్రెస్ పార్టీ గెలిచినా అనంతరం అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చెయ్యడంతో పాటు, గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు..రామారావుపల్లె – ఇటిక్యాల వరకు పైప్ లైన్ నిర్మాణం తో వంతెన ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి గంగారెడ్డి, కుంట కిషన్ రెడ్డి, రాజేందర్ గౌడ్ , తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపిటిసి సింధూజ మురళి , మిట్టపెల్లి రాం రెడ్డి, రుక్కు,గంగారెడ్డి, మహంకాళి రాజన్న, జలపతి, రమేష్, గణేష్ , మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ లక్ష్మి, తో పాటు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు..అనంతరం జగన్నాథపూర్ గ్రామంలో నాయకపు , గోండు గూడెం ప్రజలతో సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా ..మాట్లాడుతూ రెండేళ్లలో ఏ గ్రామాన్ని కూడా రెవెన్యూ విభజన చెయ్యలేదని , దీంతో గ్రామాల అభివృద్ధి అశనిపాతంగా మారిందన్నారు . బోర్నపెల్లి బ్రిడ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *