కేసీయార్ ఏం జేసిండు?

Breaking News News Political News
కేసీయార్ ఏం జేసిండు?
Rate this post

నాలుగున్నరేండ్లలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, పాలనపై ఆయనకు ఉన్న పట్టు ఫలితంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాల మేళవింపుతో చక్కని పరిపాలన కొనసాగుతోంది.
కేసీఆర్ తెలంగాణకు చేసిన పనులను ఒక్క చోట పెట్టే ప్రయత్నం ఇది. ఇందులో ప్రధానమైన అంశాలు మాత్రమే ప్రస్తావించడం జరిగింది.
#ప్రజాసంక్షేమం:
39,07,526 మంది లబ్ధిదారులకు నెలకు 1000/ 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆసరా అయిండు.
తొలిసారిగా 4.07 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం ఇచ్చిండు.
అంతకుముందు ఏ పాలకులు పట్టించుకోని 1,23,294 మంది ఒంటరి మహిళలను పెన్షన్ అందించి ఆదుకుంటుండు.
కల్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ ద్వారా 3,19,592 మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్ధిక సాయం చేసి పెద్ద దిక్కు అయ్యిండు.
కేసీయార్ కిట్, అమ్మ ఒడి పథకం ద్వారా 3,06,977 తల్లిబిడ్డలకు సహాయం అందించిండు.
ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 22,28,150 మంది గర్భిణి, బాలింతలకు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నడు.
సంక్షేమ హాస్టళ్లు, అంగన్ వాడీలు, స్కూళ్లల్లో ఉన్న 47.65 లక్షల విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి, పౌష్టికాహారం అందిస్తున్నడు.
దీపం పథకం ద్వారా 9.97 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పేద గృహిణులకు వంట ఇబ్బందులను తీర్చిండు.
85,53,157 రేషన్ కార్డుల మీద 2.74 కోట్ల మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రూపాయికే కిలో బియ్యం ఇస్తుండు.
రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో బ్రతకడానికి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో 2,72,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తుండు.
47,000 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇస్తుండు.
దివ్యాంగులకు సబ్సిడీ లోన్లు, బ్యాటరీ బైకులు, ల్యాప్ టాప్స్, ట్రైసైకిల్స్, ఇతర ఉపకారాలను అందజేసిండు.

#వ్యవసాయం:
ఇచ్చిన హామీ ప్రకారం 35.30 లక్షల రైతుల 16,125 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు.
రైతు బంధు పేరుతో దాదాపు 58 లక్షల రైతుల పంట పెట్టుబడి కష్టాలను తీర్చడానికి ఎకరానికి సంవత్సరానికి రు. 8000 ఇస్తుండు.
28 లక్షల మంది రైతులకు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే రు. 5 లక్షల ఉచిత జీవిత భీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు ధైర్యంగా నిలుస్తుండు.
రైతుకు సంఘటిత శక్తిని తెలియజేయడానికి 1.61 లక్షల మంది రైతులతో గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిండు.
2009 నుంచి బకాయి పెట్టిన ఇన్ పుట్ సబ్సిడీని 12.64 లక్షల రైతులకు చెల్లించిండు.
రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ నీటి మోటార్లకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండు.
6.18 లక్షల మంది రైతులకు సాదాబైనామాల భూములకు ఉచితంగా పట్టా చేసి ఇచ్చిండు.
గడచిన 60 ఏండ్లలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న179 గోదాములుంటే, కొత్తగా 18.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల 364 గోదాములు కట్టించిండు.
వ్యవసాయ యాంత్రీకరణ కోసం 50% నుంచి 95% సబ్సిడీపై 13,934 ట్రాక్టర్లను పంపిణి చేసిండు.
31,274 ట్రాక్టర్ సేద్య పరికరాలను, ఒక్కో మండలానికి 10 వరినారు యంత్రాలను ఇచ్చి సాగు కష్టాలను తీర్చిండు.
రైతులకు అవసరమైన 4,71,000 టార్పాలిన్లు, 26,179 స్ప్రేయర్లను ఇచ్చిండు.
2 లక్షల పాడి రైతులకు 50% నుండి 75% వరకు సబ్సిడీతో బర్రెలు ఇచ్చి, పాల సేకరణ ధర లీటర్ కు 4 రూ’ ఎక్కువ ఇస్తున్నడు.
ప్రతీ 5వేల ఎకరాలకు ఒకరు చొప్పున 2,638 వ్యవసాయ విస్తరణ అధికారులను కొత్తగా నియమించిండు.
రైతులకు గ్రీన్ హౌజ్,పాలి హౌజ్ వ్యవసాయంలో ప్రోత్సహించడానికి 75% సబ్సిడి అందించిండు.
ఆత్మహత్య చేసుకున్న రైతులకు 6 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నడు.
రైతులకు నాణ్యమైన ఎరువులు,విత్తనాలను సకాలంలో అందజేస్తుండు.
వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ‘సద్దిమూట’ పథకం ద్వారా భోజన సదుపాయం పెట్టిండు.
వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసి రైతన్నకు ఊరట ఇచ్చిండు.
నీటి తీరువా పన్నును రద్దు చేసి పాత బకాయిలను కూడా రద్దు చేసిండు.
పశువుల కోసం మొబైల్ హాస్పటల్స్ ఏర్పాటు చేసిండు.

#సాగునీటి రంగం:
మానవ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా 147.71 టిఎంసిల గోదావరి నీటిని మన పొలాలకు తీసుకువచ్చే గొప్ప ప్రాజెక్ట్ మొదలుపెట్టి జల్ది పూర్తిచేస్తుండు.
పెండింగ్ లో మిడ్ మానేరు ప్రాజెక్టును రికార్డ్ సమయంలో పూర్తి చేసిండు.
శ్రీరాం సాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువను జలకళతో నింపే ప్రాజెక్ట్ మొదలు పెట్టిండు..
మిషన్ కాకతీయ ద్వారా గత నాలుగేళ్లలో 18,000 చెరువులు, కుంటలను బాగు చేసి వాటి కింది ఆయకట్టుకు నీళ్లు అందించిండు.
‘కల్వకుర్తి ఎత్తిపోతల పథకం’ ద్వారా 3,50,000 ఎకరాల పాలమూరు బీళ్లకు నీళ్లు మల్లిస్తుండు.
పాలమూరు జిల్లా ‘భీమా ఎత్తిపోతల పథకం’ ద్వారా 1,70,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుండు.
జూరాల నుండి నీటిని కోయల్ సాగర్ తెచ్చి దాని కిందున్న 60,000 ఎకరాలకు నీటి కల సాకారం చేసిండు.
‘సీతారామ ఎత్తిపోతల పథకం-I’ ద్వారా 3,28,853 ఎకరాలకు నీళ్లు ఇచ్చే పథకం పూర్తి చేస్తుండు.
రికార్డ్ సమయంలో పూర్తిచేసిన ‘భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని మల్లించి 60,000 ఎకరాలకు నీళ్లు అందించిండు.
ఆర్.విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 3.41 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఉపాయం చేసిండు.

#విద్యుత్ రంగం:
రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అయిపోతుందన్న వాళ్ళే నివ్వరపోయేలా 24 గంటలు కరెంట్ ఇస్తుండు.
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (7వ యూనిట్) 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసిండు.
రాష్ట్రం ఏర్పడేనాటికి 2,397 సబ్ స్టేషన్లు ఉంటే కొత్తగా 514 సబ్ స్టేషన్లు ఏర్పాటుచేసిండు.
కొత్తగా 19,154 కిమీ ల పొడవు విద్యుత్ లైన్లను ఏర్పాటు చేపిచ్చిండు.
దామరచర్ల వద్ద 4000 మెగావాట్ల సామర్ధ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ స్టేషన్ కు నిర్మాణం మొదలుపెట్టిండు.
తెలంగాణ జెన్ కో ఆధ్వర్యంలో మణుగూరు వద్ద భద్రాద్రి అల్ట్రా మెగా పవర్ స్టేషన్ నిర్మాణం మొదలుపెట్టిండు.
అతితక్కువ కాలంలోనే ఛత్తీస్ఘడ్- తెలంగాణల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడం వల్ల నేషనల్ గ్రిడ్ తో అనుసందానం చేసిండు.

#మిషన్ భగీరథ :
దేశానికే ఆదర్శమైన ‘మిషన్ భగీరథ’ పేరుతో 2.74 కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నడు.

#హరితహారం:
ప్రజల భాగస్వామ్యంతో ‘తెలంగాణకు హరితహారం’తో 200 కోట్ల మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే కార్యక్రమము చేసిండు.

#రోడ్స్ అండ్ బిల్డింగ్స్:
రాష్ట్రంలో 2,570 కి.మీ ల కొత్త రోడ్లు వేయించిండు, 4,000 కి.మీ ల రోడ్లను రిపేర్ చేయించిండు.
మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రాలకు 1007 కి.మీ ల సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్ రోడ్లుగా మార్చిండు.
3029 కి.మీ ల వివిధ జిల్లా రోడ్లు, స్టేట్ హైవేస్ లాంటి ప్రధాన రోడ్లన్నింటిని వెడల్పు చేపించిండు.
హైదరాబాద్ చుట్టూ ఉన్నఔటర్ రింగ్ రోడ్ ను పూర్తి చేసిండు.
2014 వరకు రాష్ట్రానికి 2,527 కిమి ల పొడవు జాతీయ రహదారులు మంజూరు అయితే గత నాలుగేళ్లలోనే 3,155 కిమీ లు మంజూరు చేపించిండు కేసీఆర్.
కొత్త జిల్లాలకు త్వరితగతిన జిల్లా కార్యాలయాల నిర్మాణం చేపిస్తున్నడు.
ప్రజలకు అందుబాటులో ఉండటానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు కట్టిస్తున్నడు

#వైద్య, ఆరోగ్య రంగం:
ఆరోగ్య తెలంగాణకై దాదాపు 30,000 వేల కోట్ల బడ్జెట్ వైద్య ఆరోగ్య రంగంకు కేటాయించిండు.
కేసీయార్ కిట్ ద్వారా 3,06,977 మంది నవజాత శిశువులకు అవసరమైన 16 రకాల వస్తువులను ఉచితంగా ఇచ్చిండు.
గర్భిణీ, బాలింతల అవసరాల కోసం ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తున్నడు.
గర్భిణీ, బాలింతలకు, 6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యం రక్షణకై ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 18,16,335 మందికి పౌష్టికాహారం పెడుతున్నడు.
‘కంటివెలుగు’ ద్వారా ప్రజలందరికీ ఉచిత కంటివైద్య పరీక్షలు, అవసమైన వారికి ఆపరేషన్ చేయిస్తుండు.
ప్రభుత్వ దవాఖానాల్లో కాన్పు అయినా తర్వాత తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడానికి అమ్మ ఒడి (102) వాహనాలను పెట్టిండు.
గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసిండు.
ఏరియా హాస్పటల్స్ సౌకర్యాలు పెంచడంతో పాటు 20 ఐసియూ లను ఏర్పాటు చేసిండు.
రాష్ట్రవ్యాప్తంగా రోగులకు ఉచితంగా సేవ అందించే 40 డయాలిసిస్ సెంటర్లు పెట్టిండు. డయాగ్నస్టిక్ సెంటర్లు పెడుతున్నడు.
హైదరాబాద్ లో పేద మధ్యతరగతి ప్రజల కొరకు బస్తి దవాఖానలు ఏర్పాటు చేసిండు.
బోదకాలు వ్యాధిగ్రస్తులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తుండు.
వైద్య సేవలు మెరుగు పరచడానికి వైద్యశాఖలో 1,513 పోస్టుల భర్తీ చేసిండు .
ప్రభుత్వ హాస్పటల్లో మృతి చెందిన పేదల మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 50 పరమపద వాహనాలను ఏర్పాటు చేసిండు.

#ఎస్సీ, ఎస్టి సంక్షేమం:
1750 గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిండు.
తొలిసారిగా మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించిండు.
ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగ విద్యుత్ ను 100 యూనిట్ల దాక ఉచితంగా ఇస్తుండు.
ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 134 కొత్త గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసిండు.
గిరిజన విద్యార్థుల కోసం 51 కొత్త గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేసిండు.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య కొరకు ఒక్కొక్కరికి 20 లక్షల నగదు సహాయం ఇస్తుండు.
T-PRIDE ద్వారా 2,875 దళిత, 1280 గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహం ఇచ్చిండు.
రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో 22% స్థలాలను ఎస్సీ,ఎస్టీలకు రిజర్వ్ చేసి ఉంచిండు.
దేశంలో తొలిసారిగా సివిల్ కాంట్రాక్టులలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించిండు.
69,783 ఎస్సిలకు సబ్సిడీపై లోన్లు అందించిండు.
డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా క్యాబ్,ఆటోలు ఇచ్చిండు.
రాష్ట్రమంతా కొత్త ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి, ఉద్యోగార్థులకు శిక్షణ ఇప్పిస్తుండు.
ఎస్సీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి 1,04,018 యువకులకు వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ అందించిండు.
దళితులకు 3 ఎకరాల భూమిపంపిణీ పథకం కింద దాదాపు 6000 మందికి భూమి మరియు ఇతర వ్యవసాయ అనుబంధ సౌకర్యాలు కల్పించిండు.

#మైనారిటీ సంక్షేమం:
షాదీ ముబారక్ పథకం ద్వారా పేద యువతులకు 1,00116 రూపాయల నగదు సహాయం చేస్తున్నడు.
పేద ముస్లిం, క్రిస్టియన్లకు రంజాన్, క్రిస్టమస్ పండుగల సందర్భంగా వస్త్రాలు పంపిణి చేసిండు.
పేద మైనార్టీ విద్యార్థులు సకల సదుపాయాలతో చదువుకోవాలని కొత్తగా 209 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిండు.
ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం 932 మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున సహాయం చేసిండు.
మసీదుల్లో ప్రార్తనలు నిర్వహించే ఇమామ్, మౌజంలకు 5000 గౌరవ వేతనం ఇచ్చిండు.
TS-PRIME ద్వారా మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహం ఇస్తుండు .
హైదరాబాద్ లో 10 కోట్లతో ఇస్లామిక్ సెంటర్ కం కన్వెన్షన్ హాల్ నిర్మాణం మొదలు పెట్టిండు.
ముస్లిముల వివాహ శుభకార్యాల కోసం షాదీఖానాలు ఏర్పాటుచేస్తుండు.
ఉర్దూ మీడియం ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేసిండు.

#బి.#సి #సంక్షేమం:
గొల్ల, కురుమ కులస్తులకు 84 లక్షల గొర్రెలు పంపిణి చేసి వారి ఆదాయాభివృద్ధికి కృషి చేసిండు.
తాటి, ఈత చెట్లకు పన్ను రద్దు చేసి పాత బకాయిలన్నీ మాఫీ చేసిండు.
గీత కార్మిక సొసైటీల లైసెన్స్ ల పరిమితి 5 నుండి 10 సంవత్సరాలకు పెంచిండు.
చేపల ఉత్పత్తి 68% వృద్ధి అయ్యేలా గంగపుత్ర, ముదిరాజ్ కులస్తులకు 100% సబ్సిడీతో చేపపిల్లల పంపిణి చేసిండు.
మత్స్యకారులకు చేపలు అమ్మడానికి వీలుగా సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు అందించిండు.
‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా చేనేత కార్మికులకు జీవితాల్లో వెలుగులు నింపిండు.
నేత కార్మికులకు బకాయిలున్నఋణాలన్నీ మాఫీ చేసిండు.
కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇస్తూ నేతన్నకు ఉపాధి కల్పిస్తున్నడు.
వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కుకు శ్రీకారం చుట్టిండు.
గీత కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తుండు .
హరితహారంలో భాగంగా ఈత, తాటి మొక్కలను నాటి గౌడ కులస్తులకు మేలు చేసిండు.
రాష్ట్రంలోని హెయిర్ కటింగ్ సెలూన్స్ కు వాడే విద్యుత్ డొమెస్టిక్ యూజ్ గా మార్చిండు.
కొత్తగా 119 బిసి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిండు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద వందలాది మంది విద్యార్ధులకు విదేశీ విద్యకు సాయం చేసిండు
బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి రుణాలు ఇస్తుండు.
బిసి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత విద్య అందిస్తుండు
ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి నిధులు ఇచ్చిండు.
హైదరాబాద్ లో వెనకబడిన 36 కులాలకు ఆత్మగౌరవ భవనాలకు 67.30 ఎకరాల స్థలం, 60.25 కోట్ల నిధులు కేటాయించిండు.

#విద్యార్థుల సంక్షేమం:
11,57,589 మంది విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చిండు.
రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా 542 నూతన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుచేసి 2,70,135 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిండు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నసుమారు 6 లక్షల మంది విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తుండు.
విదేశాల్లో ఉన్నత విద్యకై 1,824 విద్యార్థులకు 20 లక్షల చొప్పున 350 కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చిండు.
రాష్ట్రంలో స్కూళ్ళు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతుండు.
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిండు.
ప్రభుత్వ పాఠశాలల్లో 5400 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసిండు.
వరంగల్ లో కాళోజి హెల్త్ యూనివర్సిటి ఏర్పాటు చేసిండు.
మహబూబ్ నగర్, సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిండు.
వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు అయ్యేలా కృషి చేసిండు.
టి-సాట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగార్థులకు శిక్షణ ఇప్పిస్తుండు.
రాష్ట్రవాప్తంగా వివిధ కళాశాలల్లో TASK ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తుండు. .

#ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ:
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం కోసం కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చిండు.
వివిధ దశల్లో ఉన్న 1,02,270 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టిండు.
TSPSC మరియు ఇతర శాఖాపరమైన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా 87,346 ఉద్యోగాలకై నోటిఫికేషన్లు ఇచ్చిండు.
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉన్న 37,781 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తీ చేసిండు.
54,665 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహణ,తుది ఫలితాల వెల్లడికి సమాయత్తం చేసిండు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 20,360 ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో ఉండగా,13,308 ఉద్యోగాలు భర్తీ చేసిండు.
2011 నుండి పెండింగ్ లో ఉండి సుప్రీం కోర్ట్ తీర్పుకు అనుగుణంగా 128 గ్రూప్1 ఉద్యోగాల నియామకాలను పూర్తీ చేసిండు.
పోలీస్ శాఖలో 12,152 ఉద్యోగాల భర్తీ చేసిండు.
పంచాయితీరాజ్ శాఖలో 9,355 జూనియర్ పంచాయితీ సెక్రెటరీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిండు.
పోలీస్ శాఖలో మరో18,428 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చిండు .
గురుకుల పాఠశాలల్లో 2,932 టిజిటి, పిజిటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు.
గురుకుల జానియర్ కళాశాలల్లో 281 జూనియర్ లెక్చరర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిండు.
గురుకుల డిగ్రీ కళాశాలల్లో 465 డిగ్రీ లెక్చరర్ల నియమాకానికి నోటిఫికేషన్ ఇచ్చిండు .
సింగరేణి సంస్థలో 7,266 ఉద్యోగాల భర్తీ చేసిండు.
విద్యుత్ శాఖలో 2,681 ఉద్యోగాల భర్తీ చేసిండు.
ఆర్టీసీలో 3,950 ఉద్యోగాలు ఇచ్చిండు.
సింగరేణిలో ఇప్పడివరకు 2309 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిండు.

#ఉద్యోగుల సంక్షేమం:
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇచ్చిండు.
హెల్త్ కార్డుల ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికి ఉచిత వైద్య సౌకర్యం కల్పించిండు.
సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ లీవ్ గా ప్రకటించిండు.
ఉద్యోగులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు.
మహిళా ఉద్యోగులకు 90 రోజుల అదనపు మెటర్నిటీ లీవ్స్ ఇచ్చిండు.
58,770 ఆర్టీసీ కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు.
విద్యుత్ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ మరియు 35% ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించిండు.
సింగరేణి లాభాల్లో 55,086 కార్మికులకు మునుపెన్నడూ లేనివిధంగా 27% వాటా ఇచ్చిండు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23,000 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిండు.
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సిపియస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు చేసిండు.
ఉద్యోగులకు, జర్నలిస్టులకు వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు చేసిండు.
రెసిడెన్షియల్ స్కూల్స్ లో పనిచేస్తున్న776 కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసిండు.
3,535 లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలను టీచర్లుగా గుర్తించిండు.
పోలీస్ శాఖలోని 18,101 హోంగార్డుల జీతం రోజుకు 300 రూ”ల నుండి 675 రూ”లకు పెంచిండు.
11,236 కాంట్రాక్ట్ సభార్దినెట్ ఉద్యోగుల జీతం 6,700 నుండి 12,000 కు పెంచిండు.
7,173 కంట్రాక్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల జీతం 8,400 నుండి 15,000 లకు పెంచిండు.
5,233 కాంట్రాక్ట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగుల జీతం 10,900 నుండి 17,500 లకు పెంచిండు.
3,687 కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల జీతాలు 18,030 నుండి 37,100 లకు పెంచిండు.
1,361 పాలిటెక్నీక్,డిగ్రీ లెక్చరర్ల జీతాలను 40,270 కి పెంచిండు.
ఇతర క్యాటగిరిల్లో పనిచేస్తున్న 1,989 కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు 18,000 నుండి 27,000 కు పెంచిండు.
వివిధ కేటగిల్లో ఉన్న 26,958 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలకు సమానంగా పెంచిండు.
27,045 ఆశా వర్కర్ల జీతాలను 3,000 నుండి 6,000 కు పెంచిండు.
రెవెన్యూ శాఖలోని 24,410 విఆర్ఏ ల జీతం 6,620 నుండి 10,700 పెంచిండు.
24,000 ల జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచిండు.
18,045 ఐకెపి,విఏవో ల జీతాల పెంచిండు.
30,149 అంగన్ వాడి టీచర్ల జీతాలు 7,000 నుండి 10,500 కు పెంచిండు.
28,183 అంగన్ వాడి హెల్పర్ల జీతాలు 4,500 నుండి 6000 లకు పెంచిండు.
2,886 మంది మినీ అంగన్ వాడి వర్కర్ల జీతాలు 4,500 నుండి 6,000 లకు పెంచిండు.
108,104 సర్వీసుల్లో పనిచేస్తున్న 1,578 ఉద్యోగుల జీతాలు 11,500 ల నుండి 15,500 కు పెంచిండు.
15,417 నరేగా,సెర్ప్ ఉద్యోగుల జీతాలు 6,000 నుండి 12,000 లకు పెంచిండు.
9,335 విద్యా వాలంటీర్ల జీతాలు 5,000 నుండి 8,000 లకు పెంచిండు.
వాటర్ బోర్డు ఉద్యోగుల జీతాల పెంచిండు.
పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న గోపాల మిత్రల జీతాలు 6,000 నుండి 7,500 లకు పెంచిండు.

#పారిశ్రామిక రంగం:
రాష్ట్రం లో పరిశ్రమల స్థాపన కోసం TS-IPASS పథకం ద్వారా 7,963 పరిశ్రమలను, 1,34,147 కోట్ల పెట్టుబడిని తెలంగాణాకు తెచ్చిండు.
TS-PRIDE ద్వారా 2,875 ఎస్సి,1,280 ఎస్టీ పారిశ్రామికవేత్తల పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చిండు.
పరిశ్రమలకు కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పిస్తుండు.
సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు రాయితీలు ఇచ్చి నేతన్నలను ఆదుకుంటుండు.
మూతబడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించడానికి కృషి చేసిండు.
సిర్పూర్ పేపర్ మిల్లును ఆదుకొని పునఃప్రారంభించేలా చేసిండు.
కమలాపురంలోని బిల్ట్ పేపర్ మిల్లును మళ్ళి పనిచేసేలా కృషి చేసిండు.
కొత్త పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసిండు.

#ఐటి రంగం:
రాష్ట్రంలో ఐటి పరిశ్రమల పెట్టుబడులు ఆకర్షించడానికి నూతన IT Policy తెచ్చిండు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 1.5 లక్షల ఐటి, ఐటి సంబంధ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేసిండు.
మన రాష్ట్రం ఐటి ఎగుమతుల్లో 12% వాటాతో దేశంలో రెండవ స్థానంలో నిలిపిండు.
ఐటి ఎగుమతుల్లో దేశ వార్షిక సగటు వృద్ధిరేటు 10.3% కాగా మనరాష్ట్రం 15.6% తో ముందుండేలా కృషి చేసిండు.
దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ T-Hub ఏర్పాటు చేసిండు.
వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ లలో ఐటి విస్తరణకు చర్యలు తీసుకున్నడు.
హైదరాబాద్ లో గేమింగ్ ఇండస్ట్రి అభివృద్ధి కోసం ‘ఇమేజ్ సిటీ’ శంఖుస్థాపన చేసిండు.
We-Hub ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఇంక్యుబేటర్ సౌకర్యం కల్పించిండు.
T-Fiber ద్వారా ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కోసం మిషన్ భగీరథ పైపులైన్లతో పాటే ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తుండు .
T-App Folio మొబైల్ యాప్ ద్వారా 150 పైగా పౌరసేవలన్నీ ప్రజలకు అందుబాటు తెచ్చిండు.
వరల్డ్ ఐటి కాంగ్రెస్ హైదరాబాద్ లో నిర్వహించిండు.
ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎంట్రప్రెన్యూయార్ సదస్సు హైదరాబాద్ లో నిర్వహించిండు.
ఆపిల్, గూగుల్, అమెజాన్, ఊబర్, వంటి ప్రపంచ దిగ్గజ ఐటి సంస్థలు హైదరాబాద్ కి రావడానికి కృషి చేసిండు.
క్యాష్‌ లెస్‌ కార్యకలాపాల దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయేందుకు టీ వాలెట్ ను మొదలు పెట్టిండు.
పరిశోధనా ఫలితాల్ని మార్కెట్ కు పరిచయం చేసే సంస్థ RICH ( Research and Innovation Circle of Hyderabad) ను స్థాపించిండు.

#హైదరాబాద్ అభివృద్ధి :
హైదరాబాద్ వాసులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టులో మొదటి రెండు కారిడార్ల పనులు అత్యంత త్వరగా పూర్తి చేయించిండు.
హైదరాబాద్ కు గోదావరి నీటిని తెచ్చి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పైప్ లైన్ ఏర్పాటు చేసే పని మొదలుపెట్టిండు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తుండు.
నగరంలోని 150 ప్రాంతాల్లో 5 రూపాయల భోజనము పెడుతుండు.
ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అయ్యప్ప సొసైటి, మైండ్ స్పెస్ జంక్షన్ అండర్ పాస్, ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్ లాంటి నిర్మాణాలు చేసిండు.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 7 అర్బన్ పార్కులు ఏర్పాటు చేసిండు.
నగరంలో ఓపెన్ ఎయిర్ జిమ్స్ ఏర్పాటు చేసిండు.
హైదరాబాద్ అంతటా ఎల్ఈడి బల్బులను అమర్చి కాంతివంతం చేసిండు.
నగరంలోని యువతకు డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా 5000 క్యాబ్స్, ఆటోలు ఇచ్చిండు.
1,25,000 మందికి 125 గజాల లోపు గల ఇంటిస్థలాల్ని రెగ్యులరైజ్ చేసిండు.
3,35,165 పేద కుటుంబాల విద్యుత్ బకాయిల మాఫీ చేసిండు.
కబ్జాలకు గురైన 63 చెరువులను బాగు చేసి, నీటి వనరులను అభివృద్ధి చేస్తుండు.
నగరంలో తాజా కూరగాయల కోసం 40 చోట్ల మోడల్ మార్కెట్లను పెట్టిండు.
స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా చెత్తసేకరణకు స్వచ్ఛ ఆటోలను ఇచ్చిండు.

#శాంతి భద్రతలు:
హైదరాబాద్ నగర శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులకు అధునాతన పెట్రోలింగ్ వాహనాలు సమకూర్చిండు.
మహిళల రక్షణ, ఈవ్ టీజింగ్ అరికట్టడానికి షీ టైమ్స్ ఏర్పాటు చేసిండు.
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఏర్పాటు చేసిండు.
హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేస్తుండు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడానికి కొత్త కమిషనరేట్లు, సర్కిల్స్, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేసిండు.
పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నెల నెల నిధులు కేటాయించిండు.
హైదరాబాద్, వివిధ పట్టణాల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్సు ఇచ్చిండు.

#ఇతర కార్యక్రమాలు:
ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న 1,52,765 కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి 923.56 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు చేసి అండగా నిలపడిండు.
రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయితీలు ఏర్పాటు చేసిండు.
మన సంస్కృతి సంప్రాదాయాలను ప్రతిబించించే రాష్ట్ర అధికారిక చిహ్నాలకు గుర్తింపు ఇచ్చిండు.
బోనాలు, బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించి తెలంగాణా గొప్పదనాన్ని నలుదిక్కుల చాటిండు..
అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహ సభలు నిర్వహించి మన భాషా సాంస్కృతిక గొప్పదనాన్ని తెలియచేసిండు. .
రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో తెలుగు బోధనాంశం తప్పనిసరి చేసిండు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గుర్తింపునిస్తూ ప్రతిభను, సేవా కార్యక్రమాలను ను ప్రోత్సహించిండు.
ప్రజాకవి కాళోజి గారి జన్మదినం సెప్టెంబర్ 9 ని ‘తెలంగాణ భాషా దినోత్సవం’గా గుర్తించి కాళోజి పేరున అవార్డు ప్రకటించిండు.
తెలంగాణ ఇంజనీరింగ్ పితామహుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారి జన్మదినంను ‘తెలంగాణ ఇంజనీర్స్ డే’ గా ప్రకటించిండు..
అధికారికంగా తెలంగాణ ఉద్యమవారధి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించిండు.
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిండు..
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 10లక్షల ఆర్ధిక సహాయం, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిండు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గోదావరి,కృష్ణ పుష్కరాలను ఘనంగా ఏర్పాట్లు చేసిండు.
స్వరాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించిండు.
భవన నిర్మాణ కార్మికులకు 5 లక్షల భీమా సౌకర్యం కల్పించిండు.
దేశంలో మొదటిసారిగా న్యాయవాదులకు 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసిండు.
120 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిండు.
బ్రాహ్మణుల సంక్షేమానికి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసిండు.
రెడ్డి హాస్టల్ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా 10 ఎకరాల స్థలం,10 కోట్లు కేటాయించిండు.
ఆటోలకు రవాణా పన్ను రద్దు చేసిండు.
రేషన్ డీలర్లకు కమిషన్ పెంచిండు.
రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలో అయినా సరుకులు తీసుకునే విధంగా ఈ-పాస్, రేషన్ పోర్టబిలిటీ సదుపాయం తెచ్చిండు.
యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ పుణ్యక్షేత్రాల అభివృద్ధి చేసిండు.
కేరళ శబరిమల పుణ్యక్షేత్రంలో తెలంగాణ భవన్ కు కోటి రూపాయలు మంజూరు చేసిండు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5 రూపాయల భోజన క్యాంటీన్లు మొదలుపెట్టిండు.
గుడుంబా మహమ్మారిని తరిమి, తయారీదారులకు ప్రత్యామ్న్యాయ ఉపాధి చూపెట్టిండు.
రాష్ట్రంలో అన్నిగ్యాంబ్లింగ్,పేకాట క్లబ్బులను మూసివేయించిండు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *