29/11/2026, Sunday · 08:09:32 AM About UsPrivacy PolicyContact Us
Hamara telangana

రెండేళ్ల బంధం నన్ను కుంగదీసింది.. రోజూ బతకడమే పోరాటమైంది: అనుపమ

Narlagiri Vinay 16/10/2026 7:43 PM సినిమా 23

రెండేళ్ల బంధం నన్ను కుంగదీసింది.. రోజూ బతకడమే పోరాటమైంది: అనుపమ
Want this news as a newspaper clip?Print News Clip
  • గత రిలేషన్‌షిప్‌లో తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నటి వెల్లడి
  • నటనను వదిలేయాలనిపించిందంటూ తన బాధను పంచుకున్న అనుపమ
  • పానిక్ అటాక్స్‌, బరువు తగ్గడం, కంటి సమస్యలతో ఇబ్బందులు
  • గతాన్ని అధిగమిస్తూ కెరీర్‌పై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం

మలయాళం, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటి అనుపమ పరమేశ్వరన్ తన జీవితంలోని కఠినమైన దశ గురించి తాజాగా మాట్లాడారు. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, గతంలో ఒక వ్యక్తితో కొనసాగిన రెండేళ్ల ప్రేమబంధం తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ సమయంలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు వ్యక్తిగత జీవితం, నటనా ప్రయాణం కూడా ఇబ్బందుల్లో పడినట్లు తెలిపారు.

ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, అద్దంలో చూసుకున్నా తనను తాను గుర్తించలేని స్థితికి చేరుకున్నానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఎలా గడుస్తుందోననే భయంతో జీవించాల్సి వచ్చేదని, ఒక దశలో నటనకు స్వస్తి చెప్పాలని కూడా అనిపించిందని చెప్పారు. అయినప్పటికీ, మానసికంగా ఎంతో కష్టపడుతూ షూటింగ్‌లకు హాజరయ్యానని వివరించారు. ఆ రెండేళ్లలో తాను నటించిన సినిమాల్లో తన ప్రతిభకు తగినట్లుగా రాణించలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు.

ఆ బంధం కారణంగా మానసిక ఒత్తిడితో పాటు పానిక్ అటాక్స్‌, బరువు తగ్గడం, కంటి సంబంధిత సమస్యలు ఎదురైనట్లు అనుపమ వెల్లడించారు. మొదట ప్రేమగా ప్రవర్తించి, ఆ తర్వాత కఠినంగా వ్యవహరించడం, తిరిగి క్షమాపణలు చెప్పడం వంటి పరిస్థితులు తనను మానసికంగా అలసిపోయేలా చేశాయని తెలిపారు. అయితే, తనను వేధించిన వ్యక్తి వివరాలను ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ చేదు అనుభవం నుంచి క్రమంగా బయటపడుతూ, తన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకోవడంతో పాటు కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్లు అనుపమ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: పిల్లల సోషల్ మీడియా భద్రతపై సుప్రీంకోర్టు కీలక చర్య.. కేంద్రానికి నోటీసులు

Two yearsrelationshiphasbotheredeverydaylifebeenstruggle

About the author

N

Narlagiri Vinay

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

20 Posts

Latest News

‘జైలర్ 2’పై కమల్ హాసన్ ప్రశంసల జల్లు.. స్పందించిన నెల్సన్ హోటల్ గదిలో కలవాలని ఒత్తిడి.. సినిమా ఛాన్స్‌ కోల్పోయా: విద్యా బాలన్ ‘వారణాసి’లో కుంభ పాత్రపై ఆసక్తికర అప్‌డేట్.. పృథ్వీరాజ్‌కు మహేశ్‌, రాజమౌళి బర్త్‌డే విషెస్ పిల్లల సోషల్ మీడియా భద్రతపై సుప్రీంకోర్టు కీలక చర్య.. కేంద్రానికి నోటీసులు రూబియో పర్యటనకు ముందే రచ్చ.. జైశంకర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుమారం అవును.. ప్రభుత్వాన్ని మార్చడమే మా లక్ష్యం: ప్రశాంత్ భూషణ్ ఇది ప్రభుత్వాన్ని మార్చే కుట్ర.. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సంచలన వ్యాఖ్యలు ఫ్లైదుబాయ్‌ ఉగ్రకుట్ర కేసులో మరో ఇద్దరు పైలట్ల అరెస్ట్ హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌ ఉక్రెయిన్‌ డ్రోన్లకు స్టార్‌షీల్డ్‌ ఆంక్షలు.. ట్రంప్‌ చేతిలో తుది నిర్ణయం