District Bureau Chief
14 hours ago
జీడబ్ల్యూఎంసీ ఎన్నికలకు డిసెంబర్లో తెరలేవనుందా?
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. డిసెంబర్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వివిధ డివిజన్లలో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజలను కలుస్తూ రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది.